శ్రీజ వివాహంతో కొంత కాలంగా మెగా స్టార్‌తో పాటు ఆయన అభిమానులు షాక్‌లో ఉన్నారు. చిరు రాజకీయ రంగ ప్రవేశం గురించి వార్తలు ముమ్మరంగా వినిపిస్తున్న నేపధ్యంలో ఈ సంఘటన జరగడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ప్రశ్నార్ధకం అయింది. అయితే ఈ సంఘటన వల్ల ఆయన పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచన మానుకోలేదని తెలుస్తోంది. ముందుగా వినాయక్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం చేసి పెద్ద విజయం అందుకోవాలని ఆయన అనుకుంటున్నారట. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, బహుశా దీని తర్వాత చిరంజీవి పాలిటిక్స్‌లోకి వచ్చి, ఎన్నికలు ముగిసే వరకు మరో చిత్రం చేయబోరని అనుకుంటున్నారు. 2009 ఎలక్షన్లలో చిరు పోటీ చేయడం ఖాయం అని ఇప్పటికీ వినిపించడం విశేషం. ఇటీవల కాలంలో ఎక్కువ హిట్లు లేని చిరు ఒక పెద్ద హిట్ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మంచిదని అనుకుంటున్నారని రూమర్స్. అన్ని సక్రమంగా జరిగితే ఈ చిత్రం వచ్చే జనవరిలో మొదలు కావచ్చునని తెలుస్తోంది. చిరంజీవి కూతురి పెళ్లి వెనుక రాజకీయ హస్తం ఉందని, ఆయనను రాజకీయాల్లోకి రాకుండా ఉంచేందుకే ఈ అవకాశం కొందరు తమకు అనుకూలంగా వినియోగించుకున్నారని, ఢిల్లీలో వారి అండతోనే శ్రీజ దంపతులు కాలం గడుపుతున్నారని వదంతులు వినిపిస్తున్న తరుణంలో చిరు మలి అడుగు గురించిన ఈ కబురు ప్రత్యేకత సంతరించుకుంది. అలాగే చిరంజీవి కూతురు చేసిన ఈ పని వల్ల ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి నెలకొంది.