Chiru’s Party -‘Ugadi’

ఆంధ్రదేశంలో ఉన్న సినిమా ప్రియులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సినిమా ‘చిరంజీవి కొత్తపార్టీ ‘.రాజకీయ నాయకులకు నిద్ర పట్టని హర్రర్ సినిమా ‘చిరు కొత్త పార్టీ ‘.అనేక ఊహా గానాలు ఇప్పటికే జరిగాయి.ఎందరెందరో అనేక వ్యాఖ్యానాలు చేసారు.మిన్ను విరిగి మీద పడినా తొణకని కొణిదెల వరప్రసాద్ నిబ్బరాన్నే కొనసాగించారు.నిముష నిముషానికి సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే వస్తున్నారు.రాజకీయ పార్టీలు ఎటూ తేల్చుకోలేక పోయాయి.ఇప్పుడు కూడా చిరు రహస్యం, చిదంబర రహస్యంగానే ఉంది.అయితే ఇటీవల తన తండ్రి దశదిన కర్మ రోజున చిరంజీవి,ఆయన బావమరది మీడియాకు ఉప్పు అందించారు.త్వరలోనే ఓ పార్టీతో చిరంజీవి ప్రజల ముందుకు రాబోతున్నట్లుగా చెప్పి,చెప్పనట్లు రేఖా మాత్రంగా తెలిపారు.ఈ జనవరిలోనే పార్టీ పెట్టాలనుకున్నా,కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు రాకపోవడం వలన మరో మూడు నెలల తరువాత పార్టీ పెట్టే సూచనలు,సంకేతాలు చిరంజీవి ద్వారా వస్తున్నాయి. తాము దాదాపు రాజకీయాల్లోకి వచ్చినట్లేననీ,ప్లాట్ ఫాం పై నున్నామని అల్లు అరవింద్ అన్నారు.రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయశూన్యత ఉందనీ,మరో కొత్తపార్టీని ఆహ్వానించడానికి ప్రజలు సన్నధంగా ఉన్నారనీ,పలువురు రాజకీయ నాయకులు విశ్లేషించడం గమనార్హం!

We would like to hear your comments below: