రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న చిరంజీవి దృష్టి ఇప్పుడు మీడియాపై పడింది. తనకంటూ ఒక డైలీ పేపర్ వుంటే రానున్న రోజుల్లో అది తనకు బాగా ఉపకరిస్తుందని ఆయన భావిస్తున్నారు. దాంతో సూర్య దినపత్రికను కొనుగోలు చేయాలని ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత యేడాదే మొదలైన సూర్య దినపత్రిక కాంగ్రెస్ నాయకుడు, సినీ నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావుకు చెందినది కావడం గమనార్హం. అయితే సూర్య పత్రిక అమ్మకం కోసం చిరంజీవికి సూర్యప్రకాశరావుకు కొన్ని షరతులు చెబుతున్నారనీ, చిరంజీవి పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్ర పదవి ఇవ్వాలనేది అందులోని ఒక షరతు అనీ ఉన్నతస్థాయి టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఎవరూ ధృవీకరించడం లేదు.