అగ్ర సినీ హీరో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశానికి సమయం దగ్గర పడుతోంది. ఆయన ఎప్పుడు పార్టీ ప్రకటన చేస్తారా అని రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పార్టీపెట్టాక అవసరమయ్యే బలాలు, సదుపాయలను సమకూర్చుకోవడంలో చిరంజీవి నిమగ్నులయ్యారు. అందులో భాగంగా ఆయన ఒక హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారనేది తాజాగా వినిపిస్తున్న ప్రచారం. చిరంజీవి ఆంతరంగిక వర్గాల నుంచి ఈ వార్త లీక్ అయ్యింది. ఆ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుతం ఆ హెలికాప్టర్ ఢిల్లీలో వుంది. దాంతో బాటు మరో హెలికాప్టర్‌ను కూడా అద్దెకు తీసుకోవడానికి చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ప్రకటించాక తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలు తిరిగి, ప్రచారం చేసే వుద్దేశంతోటే ఆయన హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. అయితే ఆయన కొన్నారని వినిపిస్తున్న హెలికాప్టర్ ఏ సంస్థ తయారీది అనే సంగతి మాత్రం వెల్లడి కాలేదు.