Chiranjeevi in secret place?

శ్రీజ ప్రేమ పెళ్లి తంతుతో షాక్‌కు లోనయిన చిరంజీవి కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో లేరని తెలిసింది. ఆయన ఎక్కడ ఉన్నారు అనే విషయం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. చిరంజీవి ప్రస్తుతం ఎక్కడున్నారు అనే అంశంపై సినీ వర్గాల్లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఎక్కడున్నదీ తెలియక పోయినా, ఎప్పటికప్పుడు పరిస్తితుల గురించి ఆయన తెలుసుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. చిరంజీవితో ఫోను సంభాషణ జరిపిన పిమ్మటే శ్రీజ జంటను వైఎస్ కలుసుకోలేదని వార్తలు వచ్చాయి. దీనిని బట్టి చిరంజీవి కొన్ని ఫోనులకు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం శ్రీజ జంటను వెనక ఉండి నడిపిస్తున్న తన ప్రత్యర్ధులు శిరీష్‌కు ఏదయినా ప్రమాదం తలపెట్టవచ్చు అని ఆయన ఆందోళన చెందుతున్నారని పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఆంధ్ర జ్యోతి పత్రికలో చిరుపై కుట్ర అనే వార్త ఫ్రంట్ పేజీలో ప్రచురణ అయింది. ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా ఉంటున్న చిరంజీవి మున్ముందు ఎలా స్పందించబోతున్నారు అనేది అంతుబట్టడం లేదు. చిరంజీవి మౌనం ప్రత్యర్ధులకు, శ్రీజ జంటకు కూడా తదుపరి ఏమి చేయాలనేది తేలనివ్వకుండా చేస్తోంది. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న ఈ పెళ్లి డ్రామా ఇంతటితో ముగిసిపోలేదని మాత్రం చెప్పవచ్చు. శ్రీజ జంట హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రశాంత జీవనం సాగిస్తున్నారు అనేది తెలిసే వరకు ఈ కథలో ఏదో ఒక మలుపు ఎప్పుడయినా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.

 

 

We would like to hear your comments below: