Charmy ready for anything?

అవును. ‘భలే దొంగలు’, ‘మైఖేల్ మదన కామరాజు’ సినిమాలు చూసివాళ్లంతా ‘ఛార్మి దేనికైనా రెడీ అన్నట్లుందే’ అని చెప్పుకుంటున్నారు. తరుణ్, ఇలియానా, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ‘భలే దొంగలు’ సినిమాలో ఛార్మి కనిపించేది ఒకే ఒక్క ఐటమ్ సాంగులో. జగపతి, తరుణ్‌లతో చేసిన ఆ పాటలో ఛార్మి అందాలు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ ఆమె ఎద పొంగులతో బాటు, నాభి క్రింది ప్రాంతాన్ని కూడా ఎక్స్‌పోజ్ చేశాయి. దాంతో థియేటర్లలోని రసిక జనం హుషారుగా ఈలలు వేస్తున్నారు. ఈ పాట చేయడానికి ఆమెకు ఏకంగా 23 లక్షలు ముట్టినట్లు ప్రచారం జరిగిన సంగతి జ్ఞప్తి వుండే వుంటుంది. కాగా ఆమె హీరోయిన్‌గా నటించిన ఇటీవలి ‘మైఖేల్ మదన కామరాజు’లో అయితే మొదట్నించీ ఆమెది గ్లామర్ ప్రదర్శనే. గోవాలో కనిపించింది మొదలు తన అందాల్ని ప్రదర్శించడానికి ఆమె ఉత్సాహం చూపిస్తున్నట్లే కనిపించింది. ఈ సినిమాతో దర్శక నిర్మాతలకు ఆమె తాను ‘గ్లామర్’ పాత్రలకు సిద్దమని స్పష్టమైన సంకేతాలు పంపినట్లే. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన ‘శ్రీ ఆంజనేయం’ తర్వాత ఆమె అంతకంటే ఎక్కువగా ‘మైఖేల్ మదన కామరాజు’లో గ్లామర్ కురిపించింది. ‘అనుకోకుండా ఒకరోజు’, ‘మంత్ర’ సినిమాలతో నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఛార్మి ఇప్పుడు ఇలా ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధపడుతుండటం కేవలం సంపాదన కోసమేనని ఫిల్మ్‌నగర్ వాసులు భావిస్తున్నారు. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల’ని ఆమె నిర్ణయించుకున్నట్లే వుంది. అంటే.. మున్ముందు ఛార్మి మరింత కురుచ దుస్తుల్లో కనిపించి ప్రేక్షకుల మతులు చెడగొట్టే ప్రమాదముందన్న మాట! 

We would like to hear your comments below: