అనుకోకుండా ఒకరోజు, మంత్ర, సుందరకాండ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన అందాల తార ఛార్మి తాజాగా ఆ తరహాకే చెందిన ’16 డేస్’ సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఇందులో ఆమె అరవింద్ అనే ముక్కూ మొహం తెలీని కొత్త నటుడి సరసన చేస్తోంది. నేటి జెనరేషన్‌ను మెప్పించే రీతిలో థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఛార్మి ఒక హాట్ హాట్ ముద్దు సీనులో నటించిందనే సంగతి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారంలోకి వచ్చింది. తెలుగులో మిగతా పేరుపొందిన తారలతో పోలిస్తే ఛార్మి కాస్త ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేస్తున్నదని చాలామంది భావిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో ‘శ్రీ ఆంజనేయం’లో వంపు సొంపుల్ని ప్రదర్శించిన ఆమె ఇటీవలి ‘మైఖేల్ మదన కామరాజు’ సినిమాలో మరింతగా అందాలు ఆరబోసి ప్రేక్షకుల మతులు పోగొట్టింది. అయితే ’16 డేస్’లో ఒక కొత్త నటునితో ఆమె ముద్దు సీనులో నటించడమనేది అందర్నీ ఆశ్చర్యపరిచే సంగతే. ఆ సన్నివేశంలో ఛార్మి నిమిషం పైగా హీరో అరవింద్ పెదాల్ని తన పెదాలతో మూసేస్తుందని చెప్పుకుంటున్నారు. అంతర్గత వర్గాల కథనం ప్రకారం మొదట ఈ సన్నివేశం చేయడానికి ఛార్మి ఒప్పుకోలేదు. దాంతో ఆ ఒక్క సన్నివేశం చేయడానికి అదనంగా రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు నిర్మాత అంగీకరించారు. ఈసారి ఛార్మి సరేనంది. అంతేకాదు.. ఇదే సినిమాలో ఒక సన్నివేశంలో ఆమె చాలాసేపు లో దుస్తులతో కనిపిస్తుంది. హీరో, ఆమె స్నేహితులు టీజింగ్ చేసే సన్నివేశంలో ఆమె ఇలా నటించింది. సో.. డబ్బు కోసం ఛార్మి ఎలా నటించేందుకైనా సిద్ధపడుతున్నదని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ‘భలే దొంగలు’లో గ్లామర్‌గా కనిపిస్తూ ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి 23 లక్షలు తీసుకోవాడాన్ని దీనికి మరో ఉదాహరణగా వారు చెప్పుకుంటున్నారు.