నేడు ఫిల్మ్‌నగర్‌లో హాట్ హాట్‌గా ప్రచారమవుతున్న గాసిప్ ఒక నటుడు, ఒక నటి పడక సీనులో వున్నప్పుడు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని. ఆ నటుడు ఆరడుగుల అందగాడే గానీ ఇప్పుడు సరైన వేషాలు రావడం లేదు. అందుకని చిన్నితెరమీదకు వచ్చి చాలా కాలమే అయ్యింది. ఆ తార మరో ఫేమస్ తారకు చెల్లెలవుతుంది. ఒకప్పుడు ఒక క్రేజీ నటుడితో కలిసి హైదరాబాద్ రోడ్లమీద షికార్లు సైతం చేసింది. ఇప్పుడామె కూడా చిన్నితెరనే నమ్ముకుంది. అలాంటి ఆ ఇద్దరూ రెండు రోజుల క్రితం ఒక గెస్ట్ హౌస్‌లో రాసలీలలు సాగిస్తూ వుంటే చూడలేని వారెవరో పోలీసులకు ఉప్పందించారు. ఇంకేముంది.. పోలీసులు అక్కడికి దిగిపోయారు. రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టేశారు. ఒక్కసారి గతుక్కుమన్న ఆ నటీనటులు తమని వొదిలిపెట్టమని బతిమిలాడారు. కానీ పోలీసులు వదలుతారా? చేసేదిలేక వారు తమ వంటిమీదున్న ఆభరణాలు తీసి ఇచ్చారనీ, దాంతో పోలీసులు మరోసారి అలాంటి పనులు చేయవద్దని హెచ్చరించి వదిలేశారనీ ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలు పోతున్నాయి.