Athidhi-Review by Srinidhi

Rating: 0.00/5

Critic Rating: (0.00/5)

అలరించే అతిథి       రేటింగ్: 3.25/5


భారీ అంచనాల నడుమ అక్టోబర్ 18ల్ విడుదల అయిన అతిథి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మహేష్ సొంత బ్యానర్లో చేసిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిన్చాడు. అతనఒక్కదే, అశోక్ చిత్రాలు రూపొందించిన సురేందర్ మళ్లీ యాక్షన్ కథనె ఎంచుకున్నాడు. మహేశ్తొ అదే పని గేయా హత్యలు చేయించి వెన్డి తెరాను రక్తమయం చేశాడు. దీని వలన ఫ్యామిలీ, క్లాస్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించకపోయినా, యాక్షన్ సినీ ప్రియులను అతిథి ఆకట్టుకుంటాడు. అతిథి విశేషాలివి…
కథ:
చేయని నేరానికి చిన్నతనంలోనే జైలుకి వెళ్తాడు అతిథి (మహేష్). తనను చేరదీసిన వాళ్ళను ఖైజర్ అనే వాడు చంపితే ఆ నేరం ఆతీథిపై పడుతున్ది. తన తల్లి, తండ్రిని అతిథి చంపాడని అపార్ధం చేసుకుంటుంది అమృత (అమృత రావు). జైలుకి వెళ్ళిన అతిథి బయటకు వచ్చి అమృత కోసమ్ వెతుకుతుంటాదు. ఖైజార్ను ఛంపాలని లక్ష్యం గేయా పెట్టుకున్న అతిథికి అమృత కనిపిస్తుంది. అతిథిని ఆమె ప్రేమించినా అతను మాత్రం అమృుతాను దూరంగా పెడతాడు. ఓ సారి అమృుతాను కొడతాడు అతిథి. సారీ చెప్పడానికి ఆమె కోసమ్ వెళ్ళినపుడు ఆమె ఎవరో కాదు తాను వెతుకుతున్న అమ్మాయే అని తెలుస్తుంది. ఆమెను వెతుక్కుంటూ వచిన అతిథికి ఆమె 1000 కోట్లకు వారసురాలు అని, ఆమె ప్రాణాలకు ఖైజర్ వల్ల ముప్పు ఉందని తెలుస్తుంది. అమృతని కాపాడుకుంటూ అంగ రక్షకుడిలా ఉంటాడు అతిథి. ఖైజర్ ఎవరు అన్నది అతనికి తెలీదు. అతదేవరో తెలుసుకుని మత్తు పెట్టడమే పతాక సన్నివేసం. ఈ క్రమమ్లో అమృటకి అతిథి తన వాళ్ళను చంపలెదు అని తెలుస్తుంది.
కథనం:
రీసెంట్గా వచ్చిన చిరుత కథకు దగ్గర పోలికలతో మొదలైన అతిథి తదుపరి వేరే త్రాకు మీదకు మారుతుంది. చిన్నప్పుడే జైలుకి పోవడం, తిరిగి వచ్చి చిన్నప్పటి స్నేహితురాల్ని వెతకడం చిరుతాను తలపించగా, బాంక్ వాళ్ళకు బాకీలు వసూలు చేసి తెచే వ్యక్తిగా హీరో బ్యాక్డ్రాప్, ఎవరో ఒకరిని జైలుకి వెళ్ళి వస్తున్డే తత్వం పోకిరిణి గుర్తు చేశాయి. హెరో కండ బలాన్ని చూపిన్చే సన్నివేసాలతో కథ సాఫీగానే సాగినా, ప్రతమార్ధం చివరకు గానీ కథకు ఒక లక్ష్యం ఏర్పడదు. హీరోయిన్ని ఛంపదానికి ప్లాన్ చేస్తున్నారు అనగానే హీరోకు తక్షణ కర్తవ్యం ఏర్పడుతుంది. అంత వరకు ఉన్న లక్ష్యం కన్తే ఇది సీరియస్ కావడంతో ప్రేక్షకులకి కథ మీద ఆసక్తి కలుగుతుంది. అందుకు తగ్గట్టె ద్వితీయార్ధం స్పీడుగా సాగుతుంది. హీరో, విలంకు మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆకట్టుకుంటుంది. పలు యాక్షన్ ప్రధాన సన్నివేసాలతో కథ ముదిరి పాకాన పడుతుంది. మంచి థ్రిల్లర్ చూస్తున్న అనుభూతికి లోను చేస్తూనె, హీరో పాత్రపై జాలి కలిగేలా చేస్తాదు దర్శకుడు. ఆ కోణం వలన సెంటిమెంట్ తోడయింది. అయిథే ప్రీ క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాలు నెమ్మడించాయి. యాక్షన్ పాళ్ళూ ఎక్కువ అవడంతో కథనం నెమ్మడించింది. అయినప్పటికీ క్లైమాక్స్కు ముందు వచ్చే ట్విస్టుతో మళ్లీ వేగం పుంజుకుంది.   పతాక సన్నివేశాల్లో హీరోయిన్ విలన్తో జరిపే సంభాషన మాస్కి నచ్చుతుంది. క్లైమాక్స్లో హింస ఎక్కువాయిన మాట వాస్తవం.
అభినయం:
మహేష్ బాబు సరికొత్త తలకట్టుతో అందంగా ఉన్నాడు. క్లిశ్టమయిన సన్నివేసాల్లో కూడా సటిల్గా నటించి తన ప్రత్యేకత చాటుకున్నాడు. యాక్షన్ ద్రుస్యాల్లో అతను పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపించింది. పాప చనిపోయిన సన్నివేసాల్లో అతని నటన చాలా బాగుంది. అమృతా రావు అందంగా ఉంది. చక్కని నటన కనబరిచింది. మురళీ శర్మ నటన ఆకట్టుకుంటుంది. సునీల్, వేను మాధవ్, బ్రంానందం కనిపించిన కాసేపూ నవ్వించారు. కోటా, ఆశీష్ విభిన్నమయిన నటనతో ఆకర్షించారు.
సాంకేతిక వర్గం:
మని శర్మ సంగీతంలో పాటలు అన్నీ బాగున్నాయి. వాటికి చక్కని చిత్రీకరణ జత కలిసింది. రీరేకొర్డింగ్ స్టోరీ మూద్ను ఎలివేట్ చేసింది. అబ్బూరి రవి సంభాషణలు బాగున్నాయి. నేను కొట్టి మాట్లాడతాను, కొట్టేసా ఇప్పుడు మాట్లదుకుందమా డైలాగ్ బాగుంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం కనువిందు చేసింది. ఎడిటింగ్లో నేర్పు కనబరిచారు. ఎడిటింగ్ వలనే సినిమా చాలా స్టైలిష్గా అనిపించింది. సురేందర్ దర్శకత్వ ప్రతిభ పలు సన్నివేసాల్లో బాగా తెలిసింది. కథలో సస్పెన్స్ మెయిన్టైన్ చేయదంలో అతని నేర్పు మెచ్చదాగింది. అయితే హింసాత్మక సన్నివేసాలు మేరీయీ ఎక్కువ అయ్యాయి. కథ విషయంలో వివిధ ఆంగ్ల చిత్రాలు కాపీ చేశాడు. ప్రధాన కథ మ్యాన్ ఆన్ ఫైర్ చిత్రాన్ని పోలి ఉంది. క్లిమాక్స్ గ్లాడియాటోర్ గుర్తు చేస్తుంది.
బాక్స్ ఆఫీస్ ఫలితం:
కుటుంబ కథా చిత్రాలను, వినోదాత్మక చిత్రాలను ఇష్టపడే వాళ్ళకు అతిథి నాచాడు. యాక్షన్ సినిమా ప్రేమికులకు మాత్రం ఈ స్టైలిష్ సినిమా కనువిందు చేస్తున్ది. మాస్ ప్రేక్షకులు మెచ్చితే అతిథి విజయం దిశగా పయనించ గలదు. మహేష్ అభిమానులు ఆతిథితో సంతృప్తి చెందుతారు. అతని కెరీర్లో ఇది గొప్ప సినిమాగా కాకున్నా పర్వాలేదనే సినిమాగా నిలుస్తుంది.
 
శ్రీనిధి

 

Give your rating:

We would like to hear your comments below: