మరిన్ని అవకాశాల కోసం గ్లామర్ తార అనుష్క తన రెమ్యూనరేషన్‌ను తగ్గించుకున్నదని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనుష్క ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది. అవి.. వెంకటేష్‌తో చేస్తున్న ‘చింతకాయల రవి’, రవితేజ సరసన నటిస్తున్న ‘బలాదూర్’, మరొకటి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘అరుంధతి’. వీటిలో ‘బలాదూర్’, ‘అరుంధతి’ సినిమాలు ముగింపు దశకు చేరుకోగా, ‘చింతకాయల రవి’ కూడా సగం పైగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇంతదాకా ఆమెకు మరో ఆఫర్ రాలేదు. అందుకే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడంతో పాటు మరింతగా వొంపుసొంపుల ప్రదర్శనకు సిద్ధమనే సూచనల్ని ఆమె దర్శక నిర్మాతలకు పంపిస్తోంది. గత యేడాది ‘డాన్’, ‘ఒక్క మగాడు’ వంటి సినిమాలు చేసే కాలంలో తనకు ఆఫర్లు ఇచ్చిన దర్శకులకు ఇప్పుడు పని చేస్తానని ఆమె చెబుతోంది. సో.. తక్కువ రెమ్యూనరేషన్‌కే అనుష్క నుంచి ఎక్కువ గ్లామర్ పిండుకోవచ్చనుకునే దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించవచ్చని ఫిల్మ్‌నగర్ వర్గాలు సరదాగా అనుకుంటున్నాయి.