Another film to Gautham?

కమెడియన్ బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా త్వరలో ఓ సినిమా ప్రారంభం కానున్నదని ఇదివరకే చిత్రమాల తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి మురళి అనే యువకుడు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. కాగా గౌతమ్ హీరోగా మరో సినిమా కూడా రూపొందే అవకాశాలున్నాయి. ఆ సినిమాని పర్సా మహేందర్ డైరెక్ట్ చేయనున్నట్లు వినిపిస్తోంది. మహేందర్ తాజాగా కొత్తవాళ్లతో ‘రూ. 999’ అనే సినిమాని రూపొందించాడు. అతను చెప్పిన కథ బ్రహ్మానందంకు నచ్చిందని తెలిసింది. అన్నీ అనుకూలిస్తే ఈ ప్రాజెక్ట్ కూడా 2008 లోనే సెట్స్ మీదకు వెళ్లవచ్చు.

We would like to hear your comments below: