ఐశ్వర్యా రాయ్‌కి భర్త అభిషేక్ బచ్చన్ పట్ల ఇన్సెక్యూరిటీ పెరిగిపోతోందని బాలీవుడ్ రూమర్ జోన్స్ కథనం. ఇటీవల అతని షూటింగ్స్‌కి వెళ్ళి భర్తతో పాటే ఉండి అభి ఇంటికి వచ్చే వరకు కాపలా కాస్తొందట. ద్రోణ చిత్రం సెట్లో ఈ దృశ్యం సర్వ సాధారణం అయిపోయిందని అంటున్నారు. ఆ చిత్ర కథానాయిక ప్రియాంకా చోప్రా తన భర్తను వలలో వేసుకుంటుందేమో అని ఐష్ భయమట. అభి, ప్రియాంక కలిసి నటించిన బ్లఫ్ మాస్టర్ షూటింగ్ సమయంలో వారిద్దరి గురించి వచ్చిన వదంతులే ఇందుకు కారణమని తెలుస్తోంది. రాణి ముఖర్జీని కూడా ఐష్ నమ్మడం లేదు. అభితో కలిసి రాణి నటించిన లాగా చునరీ మే ధాగ్ షూటింగ్‌కి కూడా ఐశ్వర్య రెగ్యులర్ విజిటర్ అని చెప్పుకున్నారు.