Raja to be bakra with BHADRADRI?

హీరోగా వెలుగుదామనుకుంటున్న రాజాకి ఇటీవలి కాలంలో వస్తున్న పాత్రలు అతని పట్ల సానుభూతి కలిగేట్లు చేస్తున్నాయి. చంద్రసిద్ధార్థ డైరెక్ట్ చేసిన ‘ఇదీ సంగతి!’లో అతని పాత్రా, అది ముగిసే తీరూ చాలామందికి ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకునే నటుడు ఆ పాత్ర సాధారణంగా చేయడు. ఒక వీధి రౌడీగా, విషం తాగి అర్ధంతరంగా ముగిసే పాత్రలో అతను నటించాడు. ఆ పాత్రని ఏ క్యారెక్టర్ నటుడైనా చేయొచ్చు. సరే.. ఏమైనా అదిప్పుడు గతం. అయితే మార్చి 7న రానున్న ‘భద్రాద్రి’లోనూ అతను చేసిన పాత్రలో హీరోయిజం కనిపించదని వినిపిస్తోంది. ఈ సినిమాలో అతను శ్రీహరి తమ్ముని పాత్రని చేశాడు. టైటిల్ రోల్ చేసింది శ్రీహరి. రాజా కూడా హీరో అయితే ఇద్దరి పేర్లు కలిసి వచ్చేట్లుగానో, లేదంటే తటస్థ టైటిల్‌నో పెట్టాలి. అలా కాకుండా కేవలం శ్రీహరి పాత్ర పేరునే టైటిల్‌గా పెట్టారంటే రాజా పాత్రకి అంత ఇంపార్టెన్స్ లేనట్లేనని అర్ధమవుతోంది. అంతేకాదు. ప్రోమోస్‌లోనూ రాజాకి తీరని అన్యాయమే జరుగుతోంది. వాల్ పోస్టర్లలోనూ, టీవీ యాడ్స్‌లోనూ శ్రీహరి, ఆయన సరసన నటించిన గజాలానే ఎక్కువగా కనిపిస్తున్నారు. కొన్ని పోస్టర్లలో అయితే రాజా ముఖమే కనిపించడంలేదు. మళ్లీ ఆ పోస్టర్లలో ఇతర నటుల ముఖాలు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే ‘ఇదీ సంగతి!’ మాదిరిగానే ‘భద్రాద్రి’లోనూ రాజా బక్రా అయినట్లు కనిపిస్తున్నదనేది సినీ సామాన్యుడి మాట. ఈ శుక్రవారంతో అది నిజమో, కాదో తేలనున్నది. రాజా బక్రా కాకపోతే ముందుగా సంతోషించేది మనమే.

Say your comments about "Raja to be bakra with BHADRADRI?"